కరోనా సమస్య పోయేవరకు ఎన్నికలు వద్దు : సుప్రీంకోర్టులో పిటిషన్

దేశంలో కరోనా ఉదృతి పెరిగిపోతుంది. అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రత్నాలు చేస్తున్నాయి.

Update: 2020-04-25 06:45 GMT
Supreme Court

దేశంలో కరోనా ఉదృతి పెరిగిపోతుంది. అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రత్నాలు చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది డి.నరేంద్రరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు సూచనలు చేసేలా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.. కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌కు ఆదేశాలివ్వాలని నరేంద్ర రెడ్డి కోరారు.

కరోనా వైరస్‌ను కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలన్న నిబంధనల మేరకు కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అత్యవసర కేసులు విచారిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేశారని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయకపోతే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లేనని ఆయన తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని ఓటర్ల శ్రేయస్సు కోసం వాటిని నిర్వహించకూడదని నరేంద్ర రెడ్డి తెలిపారు. 


Tags:    

Similar News