TTD Board Members 2021: టీటీడీ బోర్డ్ మెంబర్ల నియామకంపై హైకోర్టులో పిటిషన్
* 18 మంది మెంబర్లపై కేసులున్నాయని పేర్కొన్న పిటిషనర్ * 18 మంది మెంబర్లకు, టీటీడీకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ
టీటీడీ బోర్డ్ మెంబర్ల నియామకంపై హైకోర్టులో పిటిషన్(ఫైల్ ఫోటో)
TTD Board Members 2021: టీటీడీ బోర్డ్ మెంబర్ల నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 18 మంది మెంబర్లపై కేసులున్నాయని పిటిషనర్ పేర్కొన్నాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఉండి, పలు స్కాంలలో నిందితుడ్ని బోర్డ్ మెంబర్‌గా చేర్చారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు.
దీంతో ధర్మాసనం 18 మంది మెంబర్లకు, టీటీడీకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కేసులో తదుపరి వాయిదాకు కౌంటర్ దాఖలు చేయాలంది కోర్టు. ఇక విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది కోర్టు.