గ్రహణ సమయంలో నిలబడిన రోకలి

తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ.

Update: 2019-12-26 05:53 GMT

తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్లేట్ లో నీళ్లు పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిందో మహిళ.

ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో చోటుచేసుకుంది. సూర్యగ్రహణం రావడంతో.. గ్రామానికి చెందిన తాడ్డి మంగమ్మ అనే మహిళ.. తమ ఇంటి వద్ద కంచు పళ్లెంలో పసుపు నీరు పోసీ రోకలి నిలబెట్టారు. కొంతసేపు ఆ రోకలి అలాగే నిలబడింది. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతుందని వారి నమ్మకం.

ఈ సందర్బంగా నిలబడిన రోకలి బండకు చిన్నారుల చేత గుంజీలు తీయించారు. అలా చేస్తే చేసిన తప్పులను సూర్యభగవానుడు క్షమిస్తాడని వారు నమ్ముతున్నారు. దీనిని చూడటానికి గ్రామంలోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

Tags:    

Similar News