నేరుగా కాకినాడకే వస్తా, అక్కడే తేల్చుకుంటాం : పవన్ కళ్యాణ్

Update: 2020-01-13 02:01 GMT

కాకినాడలో ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ లో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ వారు, అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి , జనసేన నాయకుల మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడుతున్నారని.. తాను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము అని పోలీసులను హెచ్చరించారు పవన్. కాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. జనసేన కార్యకర్తలు నిన్న ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ద్వారంపూడి ఇంటికి భారీగా చేరుకోవడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ తీవ్రం అవ్వడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కొందరు వైసీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు.

జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి శాంతియుతంగా తమ నిరసన తెలియచేయటానికి వెళ్లిన జనసైనికులని జనసేన నాయకులని ఆయన రాళ్ళతో కొట్టించారని.. ఆ ఎమ్మెల్యే అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలను జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాడు తాను ఎప్పుడో దివంగత వంగవీటి మోహన రంగా గారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్‌ చేస్తే పవన్‌ గానీ జనసేన నాయకులు కానీ ఖండించలేదు. ముద్రగడ బహిరంగ సభ పెడితే నా వెంట ఉన్న కాపులంతా 25 బస్సులతో వెళ్లి ఉద్యమానికి మద్దతిచ్చాం. కాపు ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకం. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అంటూ ద్వారంపూడి వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News