ఇవాళ హైకోర్టులో విచారణకు మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ పిటిష‌న్

ఏపీ రాష్ట్ర మాజీ ఎ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-13 05:32 GMT
Nimmagadda Ramesh Kumar (File Photo)

ఏపీ రాష్ట్ర మాజీ ఎ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా ఆయన్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయేలా వ్యవహరించిన ఏపీ సర్కార్‌పై రిట్ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ.. ఆర్టికల్ 243 కె ప్రకారం తనను తొలగిస్తూ జారీ చేసిన జీఓ రాజ్యాంగ వ్యతిరేకమని ప్రభుత్వం జారీ చేసిన జీవోకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో పిటిషన్ పేర్కొన్నారు. కొత్త‌గా ఎస్ఈసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ క‌న‌క‌రాజ్ ను ఆయ‌న పిటిష‌న్ లో ప్ర‌తివాదులుగా పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం ఈ రోజు విచారించనుంది. న్యాయవాది అశ్వని కుమార్ నిమ్మగడ్డ తరపున హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఈసీ ని మారుస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, 2017 సుప్రీం కోర్టు జడ్జి మెంట్ ప్రకారం ఈ ఆర్డినెన్స్ ఇవ్వటం వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా చేసి తనను తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జ‌ర‌గ‌కుండా ప్రభుత్వం ఆపుతోందని హైకోర్టుకు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అనేక ఫిర్యాదుల వ‌చ్చాయ‌ని, వాటికి స్పందించినందుకే ఇలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆరోపించారు.

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ స్థానంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ధ‌ర్మాస‌నం పిటిష‌న్ విచార‌న‌కు స్వీక‌రించింది. ఇవాళ (సోమ‌వారం ) పిటిష‌న్ విచారించ‌నుంది.


Tags:    

Similar News