ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ వివాదంపై హైకోర్టులో పిటిషన్

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-11 15:31 GMT
Nimmagadda Ramesh, YS Jagan (File Photo)

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా ఆయన్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయేలా వ్యవహరించిన ఏపీ సర్కార్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నూతన ఎస్‌ఈసీగా కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు చట్టబద్ధత లేదంటూ యోగేష్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ స్థానంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News