Nara Lokesh: మాటతప్పను.. మడమ తిప్పను.. అంటే ఇదేనా..?
Nara Lokesh: మహిళా సమావేశంలో జగన్‌పై లోకేష్ ఫైర్
Nara Lokesh: మాటతప్పను.. మడమ తిప్పను.. అంటే ఇదేనా..?
Nara Lokesh: కుప్పం నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. శాంతిపురం క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. కె.గెట్టపల్లి జంక్షన్‌లో స్థానికులతో మాటమంతిలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా మహిళా సమావేశంలో జగన్‌పై లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడారు. మహిళల తాళిబొట్లను కూడా జగన్ తాకట్టు పెట్టాడని లోకేష్ ఆరోపించారు. జగన్ బినామీలు మద్యం తయారు చేస్తున్నారని, జగన్ అమ్ముతున్నాడని విమర్శించారు. మద్యం పాలసీని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడన్నారు. 2024లో ఏ మొహం పెట్టుకొని మహిళలను ఓట్లు అడుగుతాడని లోకేష్ ప్రశ్నించారు. 45 సంవత్సరాల వయసున్న మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నాడని, ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. మాటతప్పను.. మడమ తిప్పను.. అంటే ఇదేనా.. అని లోకేష్ ఎద్దేవా చేశారు.