Nara Lokesh: చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా చెబుతున్నారు
Nara Lokesh: భువనేశ్వరిని జైలుకు పంపిస్తామని.. వైసీపీ మహిళా మంత్రి వ్యాఖ్యానించారు
Nara Lokesh: చంద్రబాబును చంపేస్తామని.. వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు
Nara Lokesh: చంద్రబాబును జైలులో బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని.. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని లోకేశ్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ ములాఖత్ అయ్యారు.
చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని మండిపడ్డారు. కేసుతో సంబంధం లేని భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారన్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటార అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు భయంగా ఉందన్నారు. 72 కేజీలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 66 కేజీలు ఉన్నారని ఆయన అన్నారు.