Nara Bhuvaneshwari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి బస్సు యాత్ర

Update: 2023-10-24 05:36 GMT

Nara Bhuvaneshwari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి 

Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈనెల 25 నుంచి నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారిని దర్శించుకుని బస్సు యాత్ర పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శించనున్నారు. 25న చంద్రగిరిలో ఈ యాత్రను ఆమె ప్రారంభిస్తారు.

Tags:    

Similar News