Naga Babu: రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు

Naga Babu: నెల్లూరు జిల్లాలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారు

Update: 2023-12-17 12:48 GMT

Naga Babu: రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు

Naga Babu: ఓటు విషయంలో వైసీపీ రాజకీయాలు చేస్తోందని నాగబాబు విమర్శించారు. తన భార్య, పిల్లలు, కోడలు ఓట్లు కూడా మంగళగిరిలో నమోదు చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు అందజేశామని, అవి పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని నాగబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జనసేనను బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. జనసేన ఆవిర్భావం తర్వాత పలుసార్లు నెల్లూరుకు వచ్చానని నాగబాబు తెలిపారు.

Tags:    

Similar News