జగన్ కు ఝలక్.. 1000 పెంచిన చంద్రబాబు..

Update: 2019-03-03 02:34 GMT

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నిరుద్యోగు యువతను ఆదుకునేందుకు యువనేస్తం పథకం కొంద ఇచ్చే రూ.1000 లను 2 వేలు చేశారు. యువనేస్తం పథకానికి సంబంధించి.. దేశానికి యువతీ యువకులే వెన్నుముక అని పేర్కొన్నారు. యువత తమకు నచ్చిన రంగంలో రాణించి భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కింద అందిస్తున్న నిరుద్యోగ భృతిని నేటి నుంచి రెట్టింపు చేసి రూ.2,000 అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఇంతకుముందు కూడా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ లను 2 వేలు చేశారు చంద్రబాబు, దీంతో తాము అధికారంలోకి వస్తే రూ.3 వేలు ఇస్తామని జగన్ చెప్పారు. తాజాగా నిరుద్యోగ యువతకు కూడా భృతిని రెండు వేలు చేయడంతో జగన్ కు ఝలక్ ఇచ్చినట్టయింది. అయితే జగన్ మాత్రం నిరుద్యోగ భృతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 

Similar News