Weather Update: మండే ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజుల్లో అండమాన్ కు రుతుపవనాలు

Update: 2025-05-13 00:55 GMT

Weather Update: మండే ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజుల్లో అండమాన్ కు రుతుపవనాలు

Weather Update: ఈ ఏడాది వరణుడు ముందుగానే పలకరించబోతున్నాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందనున్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. రానున్న 4 నుంచి 5 రోజుల్లో అండమాన్, నికోబార్ దివులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పాడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పరిస్థితులు అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. దీనిపై వాతావరణ శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన ఇంకా రాలేదు. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, గురువారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఎండ తీవ్ర భారీగా పెరిగిపోతోంది. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7డిగ్రీలు, ఇంకొల్లులో 43.5 జువ్విగుంటలో 43.3 మొగలూరు లో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 17 జిల్లాల్లోని 116 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 

Tags:    

Similar News