MLC Vamshi Krishna: వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై? రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ...!
MLC Vamshi Krishna: YSRCPకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది.
MLC Vamshikrishna: వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై? రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ...!
MLC Vamshi Krishna: YSRCPకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనవర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నారని... రేపు పవన్‌కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కోసం వంశీకృష్ణ ప్రయత్నించి భంగపడ్డారు. దాంతో ఆయనకు పార్టీ అధిష్టానం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇక వంశీకృష్ణ పార్టీ మార్పుపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్..తనకు సమాచారం లేదన్నారు. పార్టీ మారడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమని అన్నారు.