మీడియా చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2019-06-18 06:36 GMT

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.CRDA ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని ఆ పదవికి తనకు ఇస్తారంటూ జరగుతున్న ప్రచారం తెలియదన్నారు. అమరాతిలో ఇల్లు కట్టుకోలేని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ సొంతంగా తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నాడని బాబు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రస్తుత నివాసం అక్రమ కట్టడమే అన్న ఆయన కోర్టు తీర్పు తరువాత ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందన్నారు. రాజధానిలో పనులు ఆగిన విషయం తనకు తెలియదంటూనే పనులు ఎందుకు నిలిపి వేశారో కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలన్నారు.   

Tags:    

Similar News