ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ లేదంటే లోకాయుక్త విచారణ: మంత్రి పేర్ని నాని

అమరావతి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై త్వరలో విచారణ మొదలవుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Update: 2019-12-28 07:00 GMT
పేర్ని నాని

అమరావతి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై త్వరలో విచారణ మొదలవుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. తనకు అమరావతిలో ఇల్లు కూడా లేదని అన్న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో హెరిటేజ్ సంస్థ రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసిందని.. ఆ కంపెనీలో తనకు వాటాలు ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఒక నిజానిజాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఆధారాలు పరిశీలించాకే ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన వారి వివరాలను బయటపెట్టిందని అన్నారు. టీడీపీ నేతలు ఈ ప్రాంతంలో మొత్తంగా 4,069.94 ఎకరాల భూమిని కొల్లగొట్టారని.. ఇది కూడా అమరావతి రాజధాని ప్రకటనకు ఉందు అంటే జూన్‌ 1, 2014 – డిసెంబర్‌31, 2014 మధ్యకాలంలో బినామీల పేరిట ఆ భూములను దోచేశారని నివేదికలో స్పష్టం చేసిందని చెప్పారు.

త్వరలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ లేదంటే సీబీసీఐడీ లేదా లోకాయుక్త సంస్థల తో విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్టు వెల్లడించారు మంత్రి. మంత్రివర్గ ఉపసంగం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ పై కూలంకషంగా చర్చించి ఆధారాలు ఉన్నాయని నమ్మిన తరువాతే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఆయన అన్నారు. రాజధాని ప్రకటనకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రులు నారా లోకేష్, పత్తిపాటి పుల్లారావు, రావేలా కిషోర్ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్,

మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్‌ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు తమ బినామీలతో భూములు కొనుగోలు చేయించారన్నారు. చంద్రబాబు ఊహజనిత కలల రాజధాని కట్టాలనుకున్నారని.. చంద్రబాబు నిర్ణయాలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అమరావతిలో ఆయనేదో రెండు లక్షల కోట్ల ఆస్తి సృష్టించి తమకు ఇచ్చి వాడుకోండని సలహా ఇస్తున్నారు. మరి ఆ డబ్బే ఉంటే అమరావతిలో ఒక్క పరిమెంటు భవనం కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. 

Tags:    

Similar News