Nara Lokesh: ఏయూలో విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో స్పందించిన మంత్రి లోకేష్
Nara Lokesh: ఆంధ్ర యూనివర్సిటీ (AU) లో విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించారు.
Nara Lokesh: ఆంధ్ర యూనివర్సిటీ (AU) లో విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. "ఆంధ్ర యూనివర్సిటీని దేశంలోనే టాప్ 100 యూనివర్సిటీల్లో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం." అని పేర్కొన్నారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ 100 రోజుల్లోపు రిపోర్ట్ సమర్పించిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
తాజా ఆందోళనల సందర్భంగా నిన్న ఏయూలో ఫిట్స్ వచ్చి ఓ విద్యార్థి చనిపోయాడని లోకేష్ తెలిపారు. అయితే, ఆ విద్యార్థిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం సరికాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థులు చర్చలకు వస్తే వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.