Minister Karumuri: బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర
Minister Karumuri: దువ్వలో రైతుకుటుంబాలకు మంత్రి కారుమూరి పరామర్శ
Minister Karumuri: బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర
Minister Karumuri: పశ్చిమగోదావరిజిల్లా తణుకులో వైసిపి, టిడిపి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ఇరగవరంలో టిడిపి రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. రేపు చంద్రబాబు ఇరగవరం నుంచి 12కిలోమీటర్లు పాదయాత్ర చేయటంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరోవైపు చంద్రబాబు పాదయాత్ర మార్గంలో టిడిపి ఫ్లెక్సీలకు పోటీగా వైసిపి నేతలు ఫ్లెక్స్ లు ఏర్పాటు చేశారు. మరోవైపు దువ్వలో రైతుల ఇళ్లకు వెళ్లి మంత్రి కారుమూరి రైతు కుటుంబాలను పలకరించారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈసందర్భంగా ఎంత దిగుబడి వచ్చింది , ధాన్యం డబ్బులు ఎన్ని రోజుల్లో అకౌంట్ లో పడ్డాయో అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రైతులకు మంత్రి కారుమూరి సన్మానం చేయటంతో పాటు వారికి స్వీట్లు తినిపించారు.