రైతులు కావాలంటే భూములు తిరిగిస్తాం : ఎమ్మెల్యే ఆర్కే

Update: 2019-12-29 11:29 GMT

అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే). రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని చెప్పిన ఆళ్ళ.. ఎవరైనా వ్యవసాయం చేసుకుంటామని అడిగితే భూములు తిరిగి ఇస్తామని మంత్రి బొత్స కూడా చెప్పారని అన్నారు. అమరావతిలో 10 శాతం మంది రైతులు మాత్రమే ఆందోళనలో పాల్గొన్నారని ఆర్కే చెప్పారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆరోగ్య సంరక్షణ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన తరువాత ఆర్కే మీడియాతో మాట్లాడారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు రైతుల చేత డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం రైతులకు ఫ్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది.. దానికి తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని ఆర్కే స్పష్టం చేశారు. మరోవైపు అమరావతిలో నిరసనలు 12 వ రోజు కూడా కొనసాగుతున్నాయి. రైతులు జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బెంజ్ సర్కిల్‌లో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా 'మనవహరం' కార్యక్రమాన్ని నిర్వహించింది. 'సేవ్ అమరావతి' నినాదం చేస్తూ హైస్కూల్ రోడ్ నుండి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. 

Tags:    

Similar News