AIIMS Mangalagiri Jobs: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకి 67,000 జీతం..!

AIIMS Mangalagiri Jobs: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకి 67,000 జీతం..!

Update: 2022-06-11 15:30 GMT

AIIMS Mangalagiri Jobs: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకి 67,000 జీతం..!

AIIMS Mangalagiri Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, మొదలైన వివరాల గురించి తెలుసుకుందాం.

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్ని సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు పోస్టులు. అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ సర్జరీ, న్యూరాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఫార్మకాలజీ, రేడియోడయాగ్నసిస్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకి నెలకు రూ.67,700లు, నాన్‌ మెడికల్‌ పోస్టులకు రూ.56100లు జీతంగా చెల్లిస్తారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎంఎస్‌/ డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా సంపాదించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఏపీ-522503 అప్లికేషన్లు పంపవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డౌన్‌లోడ్‌ చేసుకున్న అప్లికేషన్‌ ఫాంను ఫిల్‌ చేసి, ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి. జనరల్‌ అభ్యర్ధులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.500గా నిర్ణయించార. ఇంటర్వ్యూ తేదీ జూన్‌ 30, 2022న నిర్వహిస్తారు.

Tags:    

Similar News