Lockdown Effect: రైళ్లు జారిపోకుండా తాళాలు..
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో దేశం మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో దేశం మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మే మూడు వరకు అన్ని రైల్వే సేవలు నిలిచిపోయాయి. రైళ్ళను కూడా నిలిపివేసింది రైల్వే బోర్డు.
కొన్ని రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధాన రైల్వే స్టేషన్లలో రైళ్లు అన్ని పట్టాలపైనే ఉండిపోయాయి. ఖాళీ స్టేషన్ లో, చిన్న చిన్న స్టేషన్లలో సైతం నిలిపివేసి, బోగీలను ఇంజిన్ల నుంచి వేరు చేశారు.
దీంతో పట్టాలు ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల రైళ్లు కదిలే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, పట్టాలతో రైలు కోచ్ లను కలుపుతూ తాళాలు వేశారు. మరికొన్ని చోట్ల పట్టాలపై లాక్స్ ఉంచారు. ఇవి రైలు బోగీ చక్రాలను అడ్డుకుంటాయని అధికారులు వెల్లడించారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, తిరుపతి, కాకినాడ, కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి వంటి పలు రైల్వే స్టేషన్లలో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లు పట్టాలపై నిలిచివున్నాయి. కొన్ని రైళ్ళను కరోనా రోగుల కోసం ఐసోలేషన్ వార్డులా ఉపయోగిస్తుంది.