Local Liquor Gang Arrested in Vizianagaram District
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బలగొడబలో భారీ మొత్తంలో నాటుసారాను పట్టుకున్నారు అధికారులు. బులెరో వాహనంలో 60 డబ్బాలలో సుమారు 12 వందల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు తప్పించుకున్నారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు పార్వతీపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథ్. ఎన్నికల దృష్ట్యా ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.