అభివృద్ధి ఒక్కటే ప్రజల ఎజెండా కాదు

Update: 2019-05-26 10:27 GMT

టీడీపీ కార్యకర్తలూ అవాక్కయిన విషయం ఇది. అభివృద్ధి ఒక్కటే ప్రజల ఎజెండా కాదని సూచిస్తున్న వైనమిది.  ఆ మధ్య స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు అరకు నియోజకవర్గం లో ఓ చిన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ ఈ ఎన్నికల్లో దాదాపు రెండు వేల ఓట్లు పోలయ్యాయి. దానిలో టీడీపీకి కేవలం 806 ఓట్లు మాత్రమే పడ్డాయి. వైసీపీకి 1176 ఓట్లు పోలయ్యాయి. అరకులోయ మండలం పెదలబుడు గ్రామమిది. ఇక్కడ మరి దత్తత పేరుతో ఆశించిన అభివృద్ధి జరగలేదని భావించారో.. లేకపోతే అభివృద్ధి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయో..  వైసీపీ గాలికి ఇక్కడ కూడా టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందో కానీ.. ఇక్కడి ఓట్లు టీడీపీకి అనుకూలంగా రాకపోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. కొన్నాళ్ల కింద మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా, వైసీపీ తరఫున చెట్టి ఫల్గుణ బరిలో దిగారు. అయితే, వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ అత్యధిక మెజారిటీతో అరకు నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.


Similar News