కృష్ణ నది పాయకు గండి.. భయాందోళనలో లంక వాసులు

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలకు వరద భయం పట్టుకుంది. కొల్లూరు మండలం అరవింద వారధి దగ్గర.. కృష్ణానదీ పాయకు గండి పడింది. దీంతో సమీపంలోని పంట పొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

Update: 2019-08-16 05:50 GMT

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలకు వరద భయం పట్టుకుంది. కొల్లూరు మండలం అరవింద వారధి దగ్గర.. కృష్ణానదీ పాయకు గండి పడింది. దీంతో సమీపంలోని పంట పొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద ఉధృతి పెసర్లంక వైపు వస్తుండటంతో.. పలు లంక గ్రామాలు భయాందోళనకు గురవుతున్నారు. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని మొత్తం 38 లంక గ్రామాలు ఈ సాయంత్రానికి నీట మునిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పరిస్థితి భయానకంగా మారింది. కొల్లిపర మండలం వల్లభాపురం ఉంగరం కట్ట దగ్గర గండి పడటంతో.. పొలాల్లోకి వరదనీరు ప్రవహిస్తోంది. పెదలంక, చింత లంక, ఈపురు లంక, చిలుమురు లంక, అన్నవరపు లంక, పొత్తూరు లంకలతో పాటు.. కృష్ణాజిల్లాలోని పలు లంక గ్రామాల్లో వరద నీరు ప్రవహిస్తోంది.  

Full View

Tags:    

Similar News