Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్
Kasani Gnaneshwar: సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కాసాని
Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్
Kasani Gnaneshwar: ఇటీవల తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. కొత్త పొలిటికల్ దారిని ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే టీడీపీ నిర్ణయాన్ని కాసాని వ్యతిరేకించారు. దీంతో సైకిల్ దిగి.. కారెక్కారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది కేడర్‌తో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశాలు ఉంటాయని గులాబీ అధిపతి హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ పార్టీలోంచి వెళ్లాక పార్టీలోకి వచ్చిన పెద్ద నేత మీరే అని కాసానితో కేసీఆర్ అన్నారు.