ఏపీలో ప్రవేశించిన కర్ణాటక ఏనుగులు..ఆందోళనలో రైతులు !

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పట్టపగలే 17 ఏనుగుల గుంపు ప్రవేశించింది. జాతీయ రహదారి దాటి అటవి లోకి ఈ గుంపు ప్రవేశించింది. దీంతో పరిసర రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.

Update: 2020-12-24 06:37 GMT

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పట్టపగలే 17 ఏనుగుల గుంపు ప్రవేశించింది. జాతీయ రహదారి దాటి అటవి లోకి ఈ గుంపు ప్రవేశించింది. దీంతో పరిసర రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. 

ఈ ఏనుగుల గుంపును కర్ణాటక నుంచి ఆంధ్రా వైపు మళ్లించిన ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు. ఈ ప్రాంతంలో  ఐదేళ్లుగా ఏనుగులు జాడ లేదు. దీంతో ఇప్పటివరకూ  ప్రశాంతంగా పంటలు పండించుకునే వారి ఆశలు అడియాశలు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏనుగుల గుంపు.. ఎప్పుడు పంట పొలాలను ధ్వంసం చేస్తాయో అన్న భయం రైతులకు పట్టుకుంది..

ఈ రోజు ఉదయం కర్నాటక రాష్ట్రం నుండి 17 ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు మళ్లించారు.ఈ క్రమంలో కుమ్మరమడుగు గ్రామం వద్ద వి.కోట-పలమనేరు జాతీయ రహదారి దాటి ఏనుగులు దండికుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తోటకనుమ,మోర్నపల్లి,రాఘవపల్లి కుమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లి,చిన్నశ్యామ,తేట్టు తదితర పంట పొలాలపై ఈ ఏనుగులు విరుచుకుపడి అవకాశముంది.

అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే ఏనుగులను పంట పొలాలపైకి రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News