రాజధాని మార్పు మూర్కత్వపు చర్య : కన్నా లక్ష్మీనారాయణ

Update: 2020-01-01 02:47 GMT

అమరావతి నుండి రాజధానిని తరలింపు తప్పుడు చర్య అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్ద్యేశించి.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపుపై అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోలేరని అన్నారు. మంగళవారం కడపలో విలేకరుల సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నన్నారని.. రాజధానిని మార్చడంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ఆలోచన మూర్ఖత్వపు ఆలోచన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది" అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా తమ పార్టీ రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని.. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉందని అన్నారు.

కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, రైతుల ఆందోళనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. రాజధాని గ్రామాల్లో, అమరావతిలో రైతుల ఆందోళనకు బిజెపి అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన ప్రకటించారు. రెండు ప్రాంతాల మధ్య ప్రాంతీయ భేదాలను పుట్టించడం మినహా.. హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మాజీ మంత్రిఆదినారాయణ రెడ్డి అన్నారు. రెండు దశాబ్దాల క్రితం విపరీతంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నానికి రాజధానిని మార్చడం "బుద్ధిహీన నిర్ణయం" అని ఆయన వివరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News