చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండబట్టే ఏపీ అధ్వాన్నంగా మారింది: సీఎం జగన్

Update: 2019-07-11 05:50 GMT

తెలుగు రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు, మళ్లింపులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. కృష్ణా, గోదావరి జలాల వినియోగంతో తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలవుతాయంటూ జగన్‌లో సభలో తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు కాబట్టే ఏపీ అధ్వాన్నంగా మారిందన్నారు సీఎం జగన్‌. పొరుగు రాష్ట్రాల సీఎంలు సఖ్యత ఉండొద్దా? అదేదో తప్పయినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి జలాల ఒప్పందాలు కేసీఆర్‌, జగన్‌ మధ్య జరగట్లేదన్నారు సీఎం జగన్. సొంత బావమరిది శవం దగ్గర కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడలేదా అంటూ జగన్‌ ప్రశ్నించారు. సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయిందన్నారు.

Tags:    

Similar News