ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విశ్వజిత్‌

Update: 2019-03-31 01:49 GMT

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార విశ్వజిత్‌ ఎంపికయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ముగ్గురు సీనియర్ అధికారుల పేర్ల నుంచి సీఈసీ ఆయన పేరును ఎంపిక చేసింది. కాగా ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేసింది. అయితే ఆయన బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. దీంతో ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్న హైకోర్టు.. ఈసీ నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో చేసేదేమి లేక వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. అయితే ఆయన తరువాత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవికి ముగ్గురి పేర్లను ఈసీకి ప్రతిపాదించింది. వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారులైన.. నళినీ ప్రభాత్‌ (ఏడీజీ ఆపరేషన్స్‌), కుమార్‌ విశ్వజిత్‌ (పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌) కృపానంద త్రిపాఠి ఉజెలా (హోంగార్డుల విభాగం ఏడీజీ) ఉన్నారు. అయితే అన్ని విధాలుగా వీరి బయోడేటాను పరిశీలించిన అనంతరం కుమార్‌ విశ్వజిత్‌ ను ఖరారు చేశారు. 

Similar News