Nandyala: చేతబడి పేరుతో మహిళకు టోకరా.. నగ్నపూజలు చేసి భయబ్రాంతులకు గురి చేసిన మాయగాడు
Nandyala: ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Nandyala: చేతబడి పేరుతో మహిళకు టోకరా.. నగ్నపూజలు చేసి భయబ్రాంతులకు గురి చేసిన మాయగాడు
Nandyala: దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా. కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం ఇంకా మూడనమ్మకాలను వదలడం లేదు. చేతబడి, బాణామతితో ఏదో అవుతుని ఇంకా నమ్ముతున్నారు. అమాయక ప్రజల ఈ నమ్మకాలే కేటుగాళ్ల పాలిట వరంగా మారుతున్నాయి. చేతబడి పేరుతో నమ్మించి లక్షలు కాజేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఇద్దరు కేటుగాళ్లు చేతబడి పేరుతో ఓ మహిళ వద్ద నుంచి దాదాపు 9 లక్షలు వసూలు చేశారు. నగ్నపూజలు చేసి భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 9లక్షలు టోకరా వేశారని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు. ఇద్దరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.