'చలో ఆత్మకూరు' రద్దు చేసుకునే ప్రసక్తే లేదు : చంద్రబాబు

మొత్తం 540 బాధిత కుటుంబాలను తమతమ గ్రామాలకు తరలించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రస్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'చలో ఆత్మకూరు'కు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గృహనిర్బంధం చేయడంపై ఆయన స్పందించారు.

Update: 2019-09-11 06:40 GMT

మొత్తం 540 బాధిత కుటుంబాలను తమతమ గ్రామాలకు తరలించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రస్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'చలో ఆత్మకూరు'కు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గృహనిర్బంధం చేయడంపై ఆయన స్పందించారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్చ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వీటిని పోలీసులు అమలు చేయాలన్నారు. బాధితులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు నిన్నటి వరకు తాము గడువు ఇచ్చామని.. ఈ రోజు చలో ఆత్మకూరుకు బయల్టేరితే తనను అడ్డుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణమని, దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తనను గృహనిర్బంధం చేశారన్నారు. కార్యక్రమంలో పాల్గోవడానికి వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీన్‌ స్టేషన్లకు తరలించడం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి ఒక పోలీన్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీన్‌ స్టేషన్‌కు తిప్పడం మంచి పధ్ధతికాదని ఆయన

మండిపడ్డారు. ఆత్మకూరులో 120 ఎన్సీ కుటుంబాలు శిబిరంలో ఉంటే అక్కడికి భోజనాలు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంట్లోకి పనివాళ్లను కూడా రానీయకుండా అడ్డుకున్నారని పోలీసులు అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారానీ ఆయన ఆరోపించారు. తనను ఎన్ని రోజులు గృహనిర్బంధం చేస్తారో చూస్తానని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News