Fire Accident: శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: లావేరు మండలం అదపాకలో చెలరేగిన మంటలు * 23 పూరిళ్లు దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

Update: 2021-04-24 06:10 GMT

దగ్నమైన పూరిళ్ళు (ఫైల్ ఇమేజ్)

Fire Accident: శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లావేరు మండలం అదపాకలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 23 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News