ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీల నివేదికలపై చర్చించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన ఈ కమిటీ.. నేడు మరోమారు సమావేశం అవుతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు హైపవర్ కమిటీ మూడో సమావేశం జరగనుండగా.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా మొదటి సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇచ్చిన నివేదికలపై చర్చించింది, రెండో సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, సచివాలయం ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ఇప్పటికే సెక్రటేరియట్‌తోపాటు వివిధ శాఖల్లోని కొన్ని కీలక విభాగాలను విశాఖపట్నం తరలించే దిశగా
హైపవర్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తోంది. ఇదే క్రమంలో అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కావాలంటే, ప్లాట్లు లేదంటే.. భూమి తిరిగి ఇచ్చే అంశాలను పరిశీలించింది. ఇవాళ జరిగే సమావేశం తరువాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ కమిటీలో సభ్యులుగా
* ఆర్థిక ఇక శాసనసభ అ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్,
* రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
* మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,
* పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి,
* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,
* హోంమంత్రి మేకతోటి సుచరిత,
* వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,
* మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ,
* పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని,
* రవాణా శాఖ మంత్రి పేర్ని నాని,
అలాగే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లమ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, సిసిఎల్ చీఫ్ సెక్రెటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ, లా సెక్రటరీలు, సిఎస్ నీలం సాహ్ని హై పవర్ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.