Heavy Rain: కడప జిల్లాలోని 11 మండలాల్లో భారీ వర్షాలు

Heavy Rain: రోడ్లు జలమయం, ఇబ్బంది పడుతున్న వాహనదారులు

Update: 2022-10-13 06:45 GMT

Heavy Rain: కడప జిల్లాలోని 11 మండలాల్లో భారీ వర్షాలు

Heavy Rain: కడప జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గతేడాది సెప్టెంబరు నెలలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరింత అద్వాన స్థతికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పెన్నా, కుందూ, పాపాఘ్ని నదులలోకి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. మైలవరం, గండికోట, పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. పై నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా మైలవరం జలాశయం నుండి 12 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.

వర్షాలు వరదలతో బొమ్మే పల్లె ఎస్సీ కాలనీ జలమయమైంది. గోరిగనూరు గ్రామంలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. జమ్మలమడుగు టౌన్ పరిధిలో PR గవర్నమెంట్ కాలేజ్, ఆర్టీసీ బస్టాండ్, DSP ఆఫీస్‌ నీటి మునిగాయి. పాలూరు- పెద్దముడియం మధ్య రాకపోకలు బందయ్యాయి. నెమల్లదిన్నె, బలపనూరు, చిన్న పసుపుల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం తగ్గినా వాగులు, వంకల వద్దకు వెళ్ళొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్లు, నదులు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News