Heavy Rains: నేటి నుంచి 3రోజుల పాటు దంచికొట్టునున్న భారీ వర్షాలు..ఈ 5జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!!
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains: నేటి నుంచి 3రోజుల పాటు దంచికొట్టునున్న భారీ వర్షాలు..ఈ 5జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!!
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తాతోపాటు యానం వరకు నేటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ తెలంగాణలో నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సిద్ధిపేట, మేడ్చల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావ్రుతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
బుధవారం కూడా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన వీస్తుందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డీఎంఏ తెలిపింది.
వాతావరణ మార్పులను ద్రుష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసే రైతులు ముందస్తుగా వర్షాబావ పరిస్థితులను తెలుసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ నిల్వలు ఉండే ప్రాంతాలతోపాటు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు.