Viveka Murder Case: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ రద్డు పిటిషన్ పై విచారణ
Viveka Murder Case: వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు
Viveka Murder Case: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ రద్డు పిటిషన్ పై విచారణ
Viveka Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సవాలు చేశారు వివేకా కుమార్తె సునీతారెడ్డి. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. దీనిని సవాల్ చేస్తూ తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు సునితారెడ్డి. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పై ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ.