విధుల నిర్వహణలో అలసత్వం: గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యోగి సస్పెండ్..

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 'జగనన్న విద్యాదీవెన' అనే పధకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే... నవరత్నాల్లో ఒకటైనా ఈ పధకాన్ని సీఎం జగన్ విజయనగరంలో ప్రవేశపెట్టారు.

Update: 2020-03-01 05:51 GMT
jagan (File Photo)

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 'జగనన్న విద్యాదీవెన' అనే పధకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే... నవరత్నాల్లో ఒకటైనా ఈ పధకాన్ని సీఎం జగన్ విజయనగరంలో ప్రవేశపెట్టారు. ఈ పధకం కింద పేద విద్యార్దులు అయిన వారికి పూర్తిగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 20వేలు అందిస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలలో సగం రూ. 10 వేలు, జూన్, ఆగస్టు నెలలో రూ. 10 వేల రూపాయలు తల్లితండ్రులు అకౌంట్స్ లో జమ అవుతాయి. అయితే దీనిపైన విధులు నిర్వర్తించే అధికారులు అలసత్వం ప్రదర్శించారు.

'జగనన్న విద్యాదీవెన' కార్డులో మహేశ్ అనే విద్యార్థి ఫొటోకు బదులుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను అప్‌లోడ్‌ చేశారు. తన కార్డును పరిశీలించుకున్న ఆ విద్యార్థి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇదే ధోరణి పలు చోట్లల్లో కూడా కనిపించడంతో దీనిపైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కారణంగా సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ సస్పెండ్ చేయాలనీ, తప్పుడు ఫోటోను గుర్తించని వార్డు సచివాలయ సోషల్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ను కూడా సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.  

Tags:    

Similar News