Grama Sachivalayam Exams Postponed in AP: సచివాలయ పరీక్షలు వాయిదా?

Grama Sachivalayam Exams Postponed in AP: ఏపీలో కోవిద్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సచివాలయ పరీక్షలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Update: 2020-07-20 03:30 GMT
IITs Quash Basic Requirement

Grama Sachivalayam Exams Postponed in AP: ఏపీలో కోవిద్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సచివాలయ పరీక్షలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాఠశాలలను ప్రారంభించడం సైతం వాయిదా వేసింది. ఇదే కాకుండా పలు పరీక్షలను సైతం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పంచాయితీరాజ్ కమీషనర్ ట్వీట్ చేశారు. అయితే కొత్త తేదీ తొందర్లోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఆగష్టు రెండోవారంలో జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే కొత్త తేదీలు, షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

కాగా, 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరోసారి ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Tags:    

Similar News