గుంటూరులో లేడీస్ హాస్టల్లో ఉంటున్న మహిళా డాక్టర్‌కు కరోనా..

గుంటూరు జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Update: 2020-04-15 15:30 GMT
Representational Image

గుంటూరు జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 118 కరోనా కేసులు గుంటూరులోనే నమోదయ్యాయి. అయితే పలు కేసులు మాత్రం టెన్షన్ పేడుతున్నాయి. బుధవారం ఉదయం ఓ ఆర్ఎంపీ డాక్టర్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలగా, ఇవాళ మరో వైద్యురాలికి వైరస్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.

బుధవారం మధ్యాహ్నం ఓ ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. వర్కింగ్ ఉమన్స్ హాస్టల్లో ఉంటూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యురాలికి కరోనా సోకింది. గుంటూరు జిల్లాలోని గోరంట్లలోని ఫీవర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బ్రాడీపేటలోని వర్కింగ్ మహిళల హాస్టల్ లో వుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకుంది. దీంతో పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ డాక్టర్ ఉంటున్న హాస్టల్‌లో మొత్తం 35 మంది వుంటున్నారు. డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. ఆ గదిలోనే వుంటున్న తోటి మహిళలూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Tags:    

Similar News