TTD: తిరుమల కొండకు నడకదారిలో వచ్చే భక్తులకు శుభవార్త

TTD: దివ్యదర్శనం టోకెన్లు అందించాలని నిర్ణయం

Update: 2023-03-06 08:51 GMT

TTD: తిరుమల కొండకు నడకదారిలో వచ్చేభక్తులకు శుభవార్త

TTD: తిరుమల కొండకు కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పనుంది. కాలినడకన వెళ్లేవారికి దివ్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే భక్తులు సర్వ దర్శనం., దివ్యదర్శనం, సిపార్సు దర్శనాలు., అర్జిత సేవలు., ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా స్వామి వారి సేవలో పాల్గొంటారు. అయితే కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను టీటీడీ నిలిపి వేసింది.

కరోనా ఆంక్షలు సడలించిన తరువాత అన్ని దర్శనాలు తిరిగి ప్రారంభించిన టీటీడీ దివ్యదర్శనాన్ని మాత్రం ప్రారంభించలేదు. పూర్తి స్థాయి కసరత్తు అనంతరం టైమ్ స్లాట్ విధానాన్ని ప్రారంభించింది. రోజుకు 20 వేల టిక్కెట్లను అందిస్తూ వస్తోంది. నడకదారిలో మాత్రం దివ్యదర్శనం టోకెన్లు ప్రారంభించలేదు, త్వరలోనే నడకదారిలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News