Srikakulam: అసని తుపానులో కొట్టుకువచ్చిన స్వర్ణ రథం

*శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు కొట్టుకువచ్చిన బంగారు రథం.. తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చిన స్థానికులు

Update: 2022-05-11 07:59 GMT

Srikakulam: అసని తుపానులో కొట్టుకువచ్చిన స్వర్ణ రథం

Srikakulam: అసని తుఫాన్‌తో బంగాళాఖాతంలో భీకర అలజడి కొనసాగుతోంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి ఓ రథం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు బంగారు రథం ఒకటి కొట్టుకువచ్చింది. దీంతో తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఆ రథం మెరిసిపోతోంది.

భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న విషయం తెలియగానే స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. రథంపై విదేశీ భాషలో చెక్కి ఉందని మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రథాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News