Ganta Srinivasa Rao: జగన్ అభిమన్యుడు కాదట.. అర్జునుడట.. అందరూ నవ్వుకుంటున్నారు

Ganta Srinivasa Rao: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 15 శాతమే పూర్తి చేశారు

Update: 2024-01-28 07:37 GMT

Ganta Srinivasa Rao: జగన్ అభిమన్యుడు కాదట.. అర్జునుడట.. అందరూ నవ్వుకుంటున్నారు

Ganta Srinivasa Rao: వైసీపీ భీమిలిలో నిర్వహించిన శంఖారావం సభలో ఏపీ సీఎం జగన్ అన్నీ అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తాను అభిమన్యుడుని కాదని, తనకు తాను అర్జునుడిగా సీఎం చెప్పుకున్నారని, ఈ వ్యాఖ్యలను విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని గంటా ఎద్దేవా చేశారు. తన టీమ్ పాండవులని.. ప్రత్యర్ధులు కౌరవులు అని మాట్లాడారని.

కానీ జగన్ టీమే కౌరవులని, పౌరాణికంలో అన్న దుష్టపాత్రకు తగినన్ని గుణాలు జగన్‌లో ఉన్నాయని గంటా ఆరోపించారు. జగన్ గత ఎన్నికల్లో నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, దీంట్లో కేవలం 15 శాతం హామీలే అమలు చేశారని ఆరోపించారాయన.. మిగితా 85 శాతం హామీలను జగన్ మరిచిపోయారని గంటా ఆరోపించారు.

Tags:    

Similar News