వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

కృష్ణ జిల్లా గన్నవరం నియజకవర్గం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా? 2006 టీడీపీ రాజకీయ తీర్థ పుచ్చుకున్న ఆయన మూడు పర్యాలు ఎమ్మెల్యే గా ఎన్నికైయారు.

Update: 2020-04-17 03:22 GMT
vallabhaneni vamsi

కృష్ణ జిల్లా గన్నవరం నియజకవర్గం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా? 2006 టీడీపీ రాజకీయ తీర్థ పుచ్చుకున్న ఆయన మూడు పర్యాలు ఎమ్మెల్యే గా ఎన్నికైయారు. 2019 ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారా?  అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా వల్లభనేని వంశీ ఫేస్ బుక్‌లో చేసిన పోస్ట్ చూస్తే ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులకు పెద్ద షాక్.

ఫేస్ బుక్ పోస్ట్ లో ఏముందంటే..

'2006 వ సంవత్సరం ఇదేరోజు గన్నవరం నుండి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు .' అని వంశీ తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

2019లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఆయన అనంతరం వైసీపీకి మద్దతు పలికారు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

వైసీపీలో అధికారికంగా చేరకపోయినప్పటికి సీఎం వైఎస్ జగన్‌కు మద్దతిస్తూ ఆ పార్టీలో ముందుకు సాగుతున్నారు. గతంలోనే రాజకీయాల నుంచి వైదొలితునట్లు ప్రకటించిన వల్లభనేని వంశీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రకటన చేయడంతో వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటన్నట్లు చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి నేరుగా ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించకపోయినా ఫేస్ బుక్ లో అయన పోస్ట్ అయన రాజకీయాలనుంచి తప్పుకున్తున్నట్టుగానే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంపై వంశీ వైపు నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Full View

Tags:    

Similar News