కర్నూలు బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలు పూర్తి
నెల్లూరు జిల్లా గోళ్ళవారి పల్లెలో మిన్నంటిన రోధనలు గోళ్ళ రమేష్, భార్య, పిల్లలకు కన్నీటి వీడ్కోలు దగ్గర ఉండి దహన సంస్కారాలు చేయించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
కర్నూలు బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలు పూర్తి
మోయలేని గుండె భారం... మిన్నంటిన కన్నీటి వీడ్కోలతో...గోళ్లవారి పాలెంలో కర్నూల్ బస్సు ప్రమాద బాధితుల అంత్యక్రియలు పూర్తి చేశారు. తన కుమారుడు, కోడలు , వారి పిల్లలు ఇక కనిపించరు... తిరిగిరారు... అంటూ గుండెలవిసేలా రోదిస్తూ.. రమేష్ తల్లిదండ్రులు చేసిన ఆర్తనాదాలు అందరిని కన్నీరు పెట్టించాయి. గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. ఐదు రోజుల క్రితం కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద, వోల్వా బస్సు దగ్ధమైన ఘటనలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గోళ్ళవారిపల్లెకు చెందిన గోళ్ళ రమేష్ అతని భార్య ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో పూర్తిగా... కాలిపోయిన రమేష్ కుటుంబ సభ్యుల పార్టీవదేహాలను స్వగ్రామానికి తరలించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాలుగు రోజులుగా గ్రామంలోనే ఉండి బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉండి అన్నీ తానై అంత్యక్రియల క్రతువులు పూర్తి చేయించారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చి ఓదార్చారు.