సీఎం సహాయనిధికి నాలుగేళ్ళ చిన్నారి విరాళం

కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలకి సహాయం చేస్తూ చాలా మంది బాసటగా నిలుస్తున్నారు.

Update: 2020-04-07 09:58 GMT
:Perni Nani, Hemanth

కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలకి సహాయం చేస్తూ చాలా మంది బాసటగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఏపీ పప్రభుత్వానికి సహాయంగా ఓ నాలుగేళ్ళ చిన్నారి రూ. 971లను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చాడు. తానూ సైకిల్ కొనుకునేందుకు దాచుకున్న డబ్బులను కరోనాతో ఆకలితో అలమటిస్తోన్న వారికి ఉపయోగపడుతాయని హేమంత్‌ అనే చిన్నారి ఈ విరాళాన్ని ప్రకటించాడు. తన తల్లిదండ్రులతో కలిసి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వచ్చిన హేమంత్‌ ఈ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నానికి అందజేశారు. ఆ చిన్నారిని మంత్రి అభినందించారు. తన టేబుల్‌పై ఆ బాలుడిని కూర్చోబెట్టి కాసేపు మాట్లాడారు.

ఇక ఏపీలో కరోనా వైరస్ విషయానికి వచ్చేసరికి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.



Tags:    

Similar News