Anantapur: అనంతరంపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Anantapur: మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

Update: 2023-12-23 07:48 GMT

Anantapur: అనంతరంపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. కల్లూరు రైస్‌మిల్‌ నుంచి గుత్తి మండలం మామిడూరు గ్రామానికి ట్రాక్టర్‌లో బియ్యం తీసుకెళ్తుండగా.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతులు చిన్నతిప్పయ్య, నాగార్జున, శ్రీరాములు, శ్రీనివాస్‌గా గుర్తించారు. నలుగురి మృతితో మామడూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News