కేసుల వ్యవహారంపై కోడెల రియాక్ట్ .. సీఎం జగన్‌కు సూచన

Update: 2019-06-17 06:21 GMT

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌‌ కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి, నర్సారావుపేటలో గత కొన్ని రోజులుగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాగా నేపథ్యంలో మొదటిసారి కోడెల శివప్రసాద్‌‌ స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని విచారణను ఎదుర్కొనేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే కావాలనే తనను బద్నాం చేసేందుకే ఇలా చేస్తున్నారని కోడెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం,కరువు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా కొడెల శివప్రసాద్ సూచించారు. కేవలం విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే ఈ కేసులు బనాయిస్తున్నారని కోడెల తీవ్ర మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలను కావలనే వేధిందించి కేసులు పెడుతున్నారని ఇలాంటి కక్షసాదింపు చర్యలు మంచిది కాదన్నారు. రాజకీయాల్లో ఇవి మంచి పరిణామాలు కావని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన జరగాలని కోడెల శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News