గోదారికి మళ్లీ వరదలు..: అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరిక

ఇటివలే ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి, చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని నష్టం కలిగించిన విషయం తెలిసిందే. గోదావరి నష్టం నుండి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరో కంగుతినే వార్త వినాల్సి వచ్చింది.

Update: 2019-08-20 08:36 GMT

ఇటివలే ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి, చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని నష్టం కలిగించిన విషయం తెలిసిందే. గోదావరి నష్టం నుండి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరో కంగుతినే వార్త వినాల్సి వచ్చింది. గోదావరి నదికి మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. నేటి నుంచి 3 రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.ఇక దీంతో గోదావరికి పెద్దమొత్తంలో వరద నీరు వచ్చే అవకాశముందని చెప్పింది. ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

Tags:    

Similar News