కృష్ణానదికి మళ్ళీ వరదనీరు.. శ్రీశైలంలో ఆరు గేట్లు ఎత్తివేత..

Update: 2019-09-13 06:03 GMT

కృష్ణానదికి మళ్ళీ వరదనీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. దీంతో కర్ణాటకలోని నారాయణపూర్‌ కు చేరింది. అయితే ప్రాజెక్ట్‌‌ పూర్తిగా నిండటంతో.. 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు ఎత్తివేశారు. మొత్తం 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువన ఉన్న జూరాల ప్రాజెక్ట్‌ లో కూడా నీరు నిండటంతో 18 గేట్లను ఎత్తి 2.44 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అలాగే ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఆరు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో- 3 లక్షలు, ఔట్‌ఫ్లో- 2,17,021 క్యూసెక్కులుగా ఉంది. 1.84 లక్షలు క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండటంతో నాగార్జునసాగర్‌ డ్యాం ఆరుగేట్లను ఎత్తివేశారు. 

Tags:    

Similar News