అమరావతి బంద్: కొనసుగుతున్న రైతుల ఆందోళన

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ అమరావతిలో రైతులు దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.

Update: 2020-01-04 08:12 GMT

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ అమరావతిలో రైతులు దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కొందరు మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని నిరసిస్తూ.. శనివారం అమరావతిలో బంద్ కు పిలుపునిచ్చారు రైతులు. మందడంలో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా బడికి వెళ్లే పిల్లలు కూడా బడికి వెళ్లకుండా అక్కడే రోడ్లపై కూర్చుని ఆటలాడుకుంటున్నారు.బంద్ కు సహకరించాలంటూ రైతులు ఒకరికొకరు కాళ్ళు మరొకరు పట్టుకున్నారు. అలాగే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు మందడంలో ఎలాంటి సహాయం చేయకూడదని మంచినీళ్లు కూడా దూరం చేశారు. దాంతో పోలీసులకు సిబ్బంది నీరు సరఫరా చేస్తోంది. ఇటు తుళ్ళూరులోను పోలీసులను దుకాణాల వద్ద కూర్చునియ్యలేదు.

గ్రామాల్లోకి రాకుండా రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారని తెలుస్తోంది. అంతేకాదు దారిన వచ్చే పొయ్యే వాళ్లను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పరదా పట్టలు పరచి అక్కడే నిద్రపోతున్నారు. కొందరు మహిళలు కూడా పోలీసుల తీరుపై నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులకు సహకరించకుండా ఉండాలని బడ్డీకొట్లు, షాపులు బలవంతంగా మూయించారు. మరోవైపు బంద్ పిలుపుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడికెక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలావుంటే రైతులపై పోలీసులు తమ ప్రాంతాపాన్ని చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తోంది.  

Tags:    

Similar News