జూ.ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే.. టీడీపీ మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2019-06-16 10:29 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం ఎదురయ్యింది. టీడీపీలో కేవలం 23 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలుపుపొందిన విషయం తెలిసిందే కదా. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ వరుస సమీక్షలు చేపడుతోంది. అసలు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఇంత ఘోర పరాజయం పరాజయం పొందామని కారణాలను విశ్లేషించే పనిలో పడింది తెలుగు దేశం పార్టీ. కాగా గత పాలనలో జరిగిన లోపాలపై పోస్ట్ మార్టమ్ చేసుకుంటోంది టీడీపీ. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్‌కు రాబోయే రోజుల్లో పసుపు జెండా పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఇదే డిమాండ్‌ను జోరుగా వినిపిస్తున్నారు.

అయితే ఇదే ప్రశ్నపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి ? అనే దానిపై స్పందించారు. దినిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మొన్న ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉదాహరణగా చెబుతూ తన విశ్లేషణను చెప్పారు. కేవలం సినిమా వాళ్లకు ప్రజల్లో పాపులారిటీ ఉందని సెలబ్రిటీలు వస్తే ఎలా ఉంటాడో చూద్దామని ఆసక్తి మాత్రమే ఉందంటున్నారు. వెండితెరపై నటించిన నటులు జనం మధ్యలో వోస్తే ఎలా ఉంటారో చూద్దామని తీవ్ర ఆసక్తి ఉంటుదని అదంతా నిజమైన ప్రజాబలం అనుకుంటే మాత్రం చాలా తప్పు అన్నారు. కాగా జూ.ఎన్టీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దితే దిద్దొచ్చన్నారు. అయితే ఆయన గురించి ఇప్పుడేమి చెప్పలేమన్నారు. పవన్ పార్టీ పెట్టేప్పుడు తన దగ్గరికి దూతను పంపారని జేసీ చెప్పారు. అయితే ఆ దూతకు సలహా కూడా ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఏపీలో పవన్ ప్రచారం చేస్తే చూడటానికి జనం ఇరుగాపడుతారని కానీ పవన్ మాటలు నమ్మి ఎవరూ రారని ఆ దూతకు వివరించానన్నారు. ఇక టీడీపీకి చంద్రబాబే దిక్కు మనిషి మనస్తత్వాన్ని బట్టి ఫిజిక్‌ను బట్టి ఆయనకు మరో పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని అభిప్రాయపడ్డారు జేసీ. టీడీపీతో పాటు ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి సినీనటులపై కూడా జేసీ కామెంట్లు చేయడంతో ఇప్పుడు దీనిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. జూ.ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే బావుంటందని భావించినవాళ్లంతా ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర ఆలోచనలో పడ్డారు.  

Tags:    

Similar News